గురువారం ప్రముఖ యూట్యూబర్ , బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒక కేసులో షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ను అరెస్ట్ చేయటానికి వెళ్లిన పోలీసులకు యాదృచ్చికంగా షణ్ముఖ్ పట్టుబడ్డాడు. దీనితో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపత్ ని కూడా చీటింగ్ కేస్ లో అరెస్ట్ చేశారు. ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ కేసును టేకప్ చేసి షణ్ముఖ్ ని, సంపత్ వినయ్ ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ అరెస్ట్ వలన సంపత్ వినయ్, షణ్ముఖ్ గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంపత్ వినయ్ ప్రేమించిన అమ్మాయి డాక్టర్ మౌనిక అతడి గురించి చాలా నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. " షణ్ముఖ్ నాకు యూట్యూబ్లో అవకాశం ఇస్తాను అంటూ నన్ను మోసం చేశారు, వినయ్ నాకు 2015 నుండి తెలుసు,మొదట్లో తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడని, తరవాత మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరగటంతో చాలాసార్లు మేము శారీరకంగా కూడా కలిసాం, ఈ క్రమంలోనే వినయ్ ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు, మరో ఆరు రోజుల్లో నాతో పెళ్లి పెట్టుకొని, ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు” అంటూ కంప్లైంట్లో పేర్కొంది.
షణ్ముఖ్ జశ్వంత్ కేసు విషయాలపై నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. "గంజాయి దొరికిన మోతాదు చాలా తక్కువే. కానీ, గంజాయి ఎంత చిన్న మొత్తంలో దొరికినా నేరం నేరమే. కానీ, సెక్షన్లు వేరుగా ఉంటాయి. దాంట్లో భాగంగానే కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ జరుగుతుంది. ఎలాంటి శిక్ష పడుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ మీద మాత్రం అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆయనపై చర్యలు కచ్చితంగా ఉంటాయి. అమ్మాయి వైజాగ్ అయినప్పటికీ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కేసు పెట్టింది. అన్నీ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత.. కేసు మా పరిధిలోకి రాదు అని తేలితే దాన్ని వైజాగ్ కి మారుస్తాం’’ అని క్లారిటీ ఇచ్చారు ఏసీపీ. వీరిద్దరూ మంచిగా నటిస్తూ ఇలాంటి మోసాలు చేస్తున్నారా అని నెటిజన్స్ మండి పడుతున్నారు. మద్యం, గంజాయి ఇలా వీరికి లేని వ్యసనం లేదా, అని తిట్టిపోస్తున్నారు. వీరికున్న ఫేమ్ తో అమ్మాయిలను లోబరుచుకుని, వాడుకుని వదిలేస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.