నందమూరి బాలకృష్ణ - పూరి సినిమా ఈరోజే లాంఛనంగా మొదలైంది. భవ్య ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 12న రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుంది. 12 నుంచి 22 వరకూ హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించనుంది చిత్రబృందం. ఆ తరవాత ఇంగ్లండ్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఏప్రిల్ 7 నుండి మే 7 వరకు దాదాపు నెల రోజులు ఇంగ్లడ్ షెడ్యూల్ జరగనుంది. సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. వాళ్లెవరన్నది త్వరలో తెలుస్తుంది.