అందంగా, అంతకు మించి హాట్‌గా స్విమ్ చేస్తున్న ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా.? మీ కోసం చిన్న హింట్. 'శ్రద్ధ'గా చూడకుంటే 'గొడవ'యిపోద్ది మరి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా. లేదా.? అయితే ఎక్కువ కష్టపడకండిలెండి. ఈ హాట్ హాట్ గ్లామర్ పేరు శ్రద్ధా ఆర్య. 'గొడవ' సినిమాలో నటించింది. అప్పుడెప్పుడో సంగతిలెండిది. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది.
పెద్దగా పేరు రాలేదులెండి. కానీ పాప మాత్రం సో హాట్. ఆకర్షించే అందగత్తె కూడా. కానీ ఏం చేస్తాం. ఈ అందాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. అమ్మడి ఇన్‌స్టా ఒక్కసారి చూస్తే మత్తెక్కించే అందాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అరెరె ఈ అందాన్నిలా వదిలేశారేంటబ్బా అనుకోకుండా ఉండలేం మరి. సరే ఈ పిక్ విషయానికి వస్తే, చూస్తున్నారుగా స్విమ్మింగ్ పూల్‌లో తన్మయత్వంతో ఏ రేంజ్లో అందాలారబోసేసిందో.
శ్రద్ధ తప్పకుండా అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది కదూ. అదే ఈ పాప గ్లామర్ స్పెషాలిటీ. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. కానీ హిందీ సీరియల్స్‌లో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. బుల్లితెరపై ఫుల్ల్ బిజీగా గడిపేస్తోంది.