బీమ్ బ్యాగులో వయ్యారంగా కూర్చొన్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా.? గుర్తు పడతారులెండి.. అప్పుడప్పుడూ కనిపించినా, అంత తేలిగ్గా మర్చిపోయే అందమేమీ కాదులెండి. 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో నరేష్‌కి జోడీగా నటించి, హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. హీరోయిన్‌గా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ, స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్‌గా, స్పెషల్ అప్పియరెన్స్‌తో చాలా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. నటిస్తూనే ఉంది. అయితే, ఆశించిన గుర్తింపు దక్కించుకోలేకపోతోంది అమ్మడు.
గ్లామర్ విషయంలో ఎలాంటి మొహమాటాల్లేవ్. తొలి సినిమాకే విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసింది. వీలు చిక్కినప్పుడల్లా బికినీ పోజులతోనూ ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడయితే, ఎంతో బుద్ధిమంతురాలిలా వైడ్ అండ్ వైడ్ అల్ట్రా మోడ్రన్ చుడీదార్ ధరించి ముద్దుగా కెమెరాకి పోజిచ్చింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో, లూజ్ హెయిర్ స్టైల్‌తో చాలా క్యూట్ అప్పీల్ ఇస్తోంది. స్లీవ్ లెస్ డీప్ నెక్ టాప్ ధరించడం వల్ల హాట్ హాట్ అందాల వడ్డన కూడా జరిగిపోతోంది.