'శ్రద్ధ'గా చూపిస్తోన్న గ్లామర్‌ షేప్స్‌ వారెవ్వా.!

By iQlikMovies - June 08, 2018 - 13:19 PM IST

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోవాలని కోటి ఆశలతో తెలుగు తెరపై అడుగు పెట్టింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్‌. కానీ ఆమె కలలు ఆశించినంతగా నెరవేరలేదు. హీరోయిన్‌ దశ నుండి, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్ధిరపడిపోయింది. చూపించాల్సిన గ్లామర్‌ యాంగిల్స్‌ అన్నీ చాలానే చూపించేసిందీ ముద్దుగుమ్మ. అయినా కానీ హీరోయిన్‌ మెటీరియల్‌గా ఈ ముద్దుగుమ్మని అస్సలు లెక్క చేయనే లేదు. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ ఇతర భాషల్లో కూడా అరకొరా చిత్రాలతో మమ అనిపించేసుకుంది. ఇక ఇప్పుడు వెండితెర నుండి బుల్లితెర వైపు అడుగులు వేస్తోంది. బుల్లితెర అంటే షార్ట్‌ ఫిలింస్‌ అన్న మాట. ఓ ఇంగ్లీష్‌ షార్ట్‌ ఫిలింలో నటిస్తున్న శ్రద్ధా కపూర్‌ ఆ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో ఇలా తన హాట్‌ హాట్‌ అందాలను ఒలకబోసేసింది. షార్ట్‌ జీన్స్‌లో, స్లీవ్‌లెస్‌ టాప్‌లో షార్ట్‌ హెయిర్‌ స్టైల్‌లో శ్రద్దా గ్లామర్‌ కెవ్వుకేక పెట్టించేయట్లా. ఏం చేస్తాం. అన్నీ ఉన్నా అదృష్టం అనేదొకటి కలిసి రావాలి కదా. ఈ హాట్‌బ్యూటీకి అది ఎప్పుడు కలిసొస్తుందో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS