గ్లామ్‌షాట్‌: అమాయకంగా చూసి, అందాలన్నీ వదిలేసి!

మరిన్ని వార్తలు

ఈ మధ్య శ్రద్ధాదాస్‌ అందాల రచ్చతో సోషల్‌ మీడియాని హీటెక్కించడం చాలా ఎక్కువైపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నట్లుంది. అందంగా, హాట్‌గా ఫోటో సెషన్స్‌ చేయించుకుంటోంది. ఒక్కొక్కటిగా నెట్టింట్లో వదులుతూనే ఉంది. అలా నెటిజన్స్‌కి బాగా దగ్గరైపోయిన శ్రద్ధాదాస్‌ దర్శక, నిర్మాతల దృష్టిలో పడలేకపోతోంది. అమ్మడి అందాల రచ్చ చూస్తుంటే, ఎంతటి నిగ్రహమున్నవాళ్లయినా, రశిక శిఖామణులు కాకుండా ఉండలేకపోతున్నారు. ఆ రేంజ్‌లో పాప అందాల ఆరబోత కనువిందు చేస్తోంది మరి.

లేటెస్ట్‌గా ఎల్లో అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో ఓ డ్రస్‌ వేసింది. టాప్‌లో షార్ట్‌ స్లీవ్‌లెస్‌ ఇన్నర్‌ వేర్‌, బోటమ్‌లో ట్రాక్‌ ప్యాంట్‌లాంటిది ధరించి, స్ట్రెయిట్‌గా రెండు చేతులూ ప్యాంట్‌ పాకెట్స్‌లో పెట్టి నిలబడింది. ఈ పోజులో నిగనిగలాడే నడుమొంపులు మతి పోగొట్టేస్తున్నాయి. నాగుపాములాంటి ఆ నడుము షేపు చూసైనా ఆమెకి విరివిగా అవకాశాలు కుమ్మరించొచ్చు. కానీ, ఎందుకో శ్రద్ధాకి అవకాశాలే కరువయ్యాయి. ఇకపోతే యాక్సెసరీస్‌ సంగతి ఎలా ఉన్నా, పెదాలకు డార్క్‌ రోజ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ ధరించింది. గ్రే కలర్‌లో హెయిర్‌ లూజ్‌గా వదిలేసింది. ఫేస్‌లో అమాయకంగా ఓ ఎక్స్‌ప్రెషన్‌ పెట్టింది. కానీ, ఆ నడుము షేప్‌ దాటి ఇంకెటైనా చూపు తిప్పుకోనీస్తే కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS