అవార్డు కోస‌మే ఒప్పుకుందా?

By Gowthami - September 19, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

స‌రికొత్త ఇన్నింగ్స్ లో శ్రియ దూసుకుపోతోంది. ఈమ‌ధ్య క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకొంటోంది శ్రియ‌. ఆర్‌.ఆర్.ఆర్ లాంటి ప్రాజెక్టు ప‌ట్టిన త‌ర‌వాత‌.. శ్రియ‌లో మ‌రింత హుషారొచ్చింది. `అంధాధూన్‌`రీమేక్‌లో ట‌బు స్థానాన్ని కూడా త‌నే భ‌ర్తీ చేయ‌బోతోంది. అయితే ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. వీటితో పాటుగా `గ‌మ‌నం` అనే ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలోనూ శ్రియ న‌టిస్తోంది. ఈ సినిమాపై శ్రియ ప్ర‌త్యేక‌మైన ప్రేమ క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రియ చేసిన సినిమాల్లో, న‌టించిన పాత్ర‌ల‌తో పోల్చి చూస్తే `గ‌మ‌నం` లో శ్రియ పాత్ర భిన్నంగా ఉండ‌బోతోంది.

 

ఈ సినిమాలో శ్రియ డీ గ్లామ‌ర్ రోల్ పోషిస్తోంది. పైగా... త‌ను మూగ‌మ్మాయిగా న‌టించ‌బోతోంద‌ట‌. ఈ సినిమా కోసం శ్రియ పారితోషికం కూడా త‌గ్గించుకుంద‌ని టాక్‌. ఈ సినిమా కోసం ఎన్ని కాల్సీట్లు ఇవ్వ‌డానికైనా శ్రియ సిద్ధ ప‌డింద‌ట‌. శ్రియ ఇచ్చిన స‌హ‌కారం వ‌ల్లే ఈ సినిమాని అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లుగుతున్నామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఇదంతా ఈ పాత్ర‌పై శ్రియ పెంచుకున్న ప్రేమ‌కు నిద‌ర్శ‌న‌మే. ఈ సినిమాతో త‌న‌కు అవార్డు రావ‌డం ఖాయ‌మ‌ని, అటు ప్రేక్ష‌కులు, ఇటు ద‌ర్శ‌కులు త‌న‌ని చూసే దృష్టి కోణం ఈసినిమాతో మార‌బోతోంద‌ని శ్రియ భావిస్తోంద‌ట‌. అందుకే ఈ సినిమాకి ఇన్ని ఆఫ‌ర్లు ఇస్తోంది.

 

సుజ‌నారావు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఒక్క సినిమాతో... అన్ని భాష‌ల్నీ క‌వ‌ర్ చేసే అవ‌కాశం శ్రియ‌కు ల‌భించింది. పైగా ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందించ‌నున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ అండ‌దండ‌లు ఈ ప్రాజెక్టుపై ఉన్నాయి. సంజ‌నారావు క్రిష్ శిష్యురాలే. క్రిష్ ఆస్థాన ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS