క్రాక్ సూపర్ హిట్ అవ్వడంతో.. శ్రుతిహాసన్‌కి మళ్లీ లైఫ్ వచ్చినట్టైంది. తెలుగులో పలు సినిమాలకు శ్రుతి పేరు పరిశీలిస్తున్నారిప్పుడు. చేతిలో ఉన్న `వకీల్ సాబ్` కూడా హిట్టయిపోతే.. శ్రుతి తెలుగులో మరింత బిజీ అయిపోతుంది. ఆ ఉత్సాహంతోనే సోషల్ మీడియాలో ఇదివరకటి కంటే యాక్టీవ్ గా ఉంటోంది శ్రుతి. అభిమానులతో తరచూ టచ్‌లోకి వస్తోంది. తాజాగా.. ఇన్‌స్ట్రాలో జరిగిన చిట్ చాట్ తో.. శ్రుతి లేటెస్ట్ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
ఇటలీకి చెందిన మైఖైల్ తో శ్రుతి కొంతకాలం ప్రేమాయణం నడిపిన సంగతి గుర్తుండే ఉంటుంది. శ్రుతి ఎక్కడుంటే... మైఖెల్ అక్కడ ఉండేవాడు. ఇద్దరి ఫొటోలూ.. వీడియోలూ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారన్న విషయం అర్థమైపోయింది. అయితే.. ఈమధ్య ఏమైందో.. ఇద్దరికీ గ్యాప్ వచ్చేసింది. మైఖైల్ కి గుడ్ బై చెప్పేసిందని కూడా టాక్. ఇప్పుడు శ్రుతి మరోసారి ప్రేమలో పడిందట. శ్రుతి కొత్త ప్రియుడు ఎవరన్న విషయం... బయటకు రానివ్వడం లేదు. ఇన్‌స్ట్రాలో జరిగిన చిట్ చాట్ లో `మీరు ప్రేమలో ఉన్నారా` అని ఓ అభిమాని అడిగితే... `నిజం..` అంటూ.. నర్మగర్భంగా సమాధానం ఇచ్చింది. అంటే.. శ్రుతి కొత్త లవ్ చాప్టర్ మొదలెట్టినట్టే కదా?