శ్రుతి హాసన్ సుడి తిరిగింది. వరుసగా సూపర్ ఛాన్సులు కొట్టేస్తోంది. ఇటీవల `క్రాక్`తో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి.... `వకీల్ సాబ్`లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `సలార్`లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇందులో శ్రుతిహాసన్ ని ఓ కథానాయికగా ఎంచుకుంటూ.. చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ రోజు శ్రుతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా శ్రుతికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ... సలార్ టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది. నిజానికి ఇది శ్రుతికి బంపర్ ఆఫర్. ప్రభాస్ సినిమా, పైగా పాన్ ఇండియా ప్రాజెక్టు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని వదులుకోకూడదని శ్రుతి ఫిక్స్ అయ్యింది. సలార్ కోసం తన కాల్షీట్లు సర్దుబాటు చేసింది. పారితోషికంలోనూ బేరాలు ఆడలేదట. మొత్తానికి శ్రుతికి మళ్లీ మంచి రోజులు మొదలైనట్టే కనిపిస్తున్నాయి.