గోపీచంద్ మలినేని, శ్రుతి హాసన్ డి మంచి కాంబినేషన్. బలుపు సినిమా కామెడీ ఇప్పటికీ నవ్విస్తుంది. అలాగే క్రాక్ లో కూడా శ్రుతి హాసన్ ని మంచి పాత్ర రాశాడు. కానీ వీరసింహారెడ్డిలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కూరలో కరివేపాకైన కాస్త సువాసన ఇస్తుందేమో.. ఇందులో శ్రుతి హాసన్ పాత్రకు ఏ రంగు రుచి లేదు. వీరసింహారెడ్డిలో అత్యంత బలహీనమైన పాత్ర ఏదైనా ఉందా అంటే.. అది శ్రుతిహాసన్ దే. ఇందులో ఆ పాత్ర పేరు కూడా ఎవరికీ గుర్తులేదు. ఆమెతో ఎదో కామెడీ చేయాలని ప్రయత్నించారు.
నిజానికి గోపి పెన్ను లో మంచి ఫన్ను వుంటుంది. అసలు శ్రుతి హాసన్ ట్రాక్ రాసింది గోపినేనా అనే అనుమానం కలిగింది. అంత నాసిరకంగా వుంది ఆ పాత్ర తీరు. శ్రుతి హాసన్ కెరీర్ లోనే ఇంత బలహీనమైన హీరోయిన్ పాత్ర ఎప్పుడూ చేయలేదు. ఎంత బాలకృష్ణ సినిమా అయినా మాత్రం ఒక హీరోయిన్ ని అనుకున్నప్పుడు ఇంత లైట్ గా ఆమె పాత్రని ఎలా రాస్తారనిపిస్తుంది. అసలు ఆమె పాత్రకే ఎలాంటి ప్రాధాన్యత లేదనుకుంటే.. అందులో ఆమెకు ఒక ఫ్యామిలీ పెట్టారు. చాలా క్లూలెస్ గా వుంటుంది ఆ వ్యవహారం అంతా. కేవలం పాటల్లో డ్యాన్స్ చేయడానికి అన్నట్టుగా శ్రుతి పాత్రని వాడుకునే తీరు మాత్రం ఏ మాత్రం రుచించలేదు. వీరసింహారెడ్డి శ్రుతి కెరీర్ లో ఒక బ్యాడ్ ఛాయిస్ అనే చెప్పాలి.