ఐటమ్ గాళ్ గా మారుతున్న శృతి

మరిన్ని వార్తలు

పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ ప్రజంట్ వార్తల్లో నిలుస్తోంది. కెరియర్ , వ్యక్తిగతం జీవితం రెండిటికి సంబంధించిన విషయాల్లో శృతి హైలెట్ అవుతోంది.  వరుస బ్రేకప్ లతో సతమతమవుతోంది. ఇప్పటికే మూడు బ్రేకప్ లు అయ్యాయి శృతికి. కెరియర్ లో కూడా ఒక వైపు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తూ, ఇంకో వైపు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. గత ఏడాది ప్రభాస్ తో కలిసి నటించిన 'సలార్' మూవీతో  బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.  పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తో నటించటం గొప్ప విషయం. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్  ప్రభాస్ తో నటించటానికి ఆసక్తిగా ఉన్నారు. అలాంటిది శృతికి ఈ అవకాశం వచ్చింది. నెక్స్ట్   సలార్ సెకండ్ పార్ట్ లో కూడా శృతి హీరోయిన్. ఇలాంటి క్రేజీ ఆఫర్ దక్కించుకున్న శృతి ఐటమ్ సాంగ్స్ కి ఎందుకు ఒప్పుకుంటుందో అని ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. 


అవకాశాలు లేనపుడు మాత్రమే కొందరు ఐటమ్ సాంగ్స్ కి ఒప్పుకుంటారు. అలాటిది ఇంత మంచి అవకాశాలు వస్తున్నా, ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తూ కూడా ఎందుకు ఇలా ప్రత్యేక గీతాల్లో నటించటానికి ఒప్పుకుంటుందో అని, ఒక సినిమాలో చేస్తే ఇక వరుసగా అలంటి ఆఫర్స్ వస్తాయని వాపోతున్నారు. ఈ మధ్య వచ్చిన నాని 'హాయ్ నాన్న' లో ఒక పాటలో మెరిసింది. ఇప్పుడు కూడా అలంటి ప్రత్యేక గీతంలో మరొకసారి కనిపించనున్నట్లు సమాచారం. 


అనిల్ రావి పూడి, వెంకటేష్ కాంబినేషన్లో రానున్న సినిమాలో శృతి నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాలయ్య తో నటించిన శృతి ఇప్పుడు వెంకటేష్  తో నటిస్తుంది అనుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే శృతి ఇందులో హీరోయిన్ కాదు ఐటమ్ గాళ్ అని సమాచారం. ఈ న్యూస్ విన్న శృతి ఫాన్స్ ఆమెను హీరోయిన్గా తీసుకోవచ్చుకదా, ఇలా స్పెషల్ సాంగ్ కోసం కాకుండా అని  దర్శకుడిని రిక్వెస్ట్ చేస్తున్నారు.  మెగాస్టార్ చిరుతో శృతి ఇంకో సినిమాకి సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేయకపోవటమే బెటరని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS