శృతిహాసన్ కమల్ హాసన్ తనయ అన్నదాని కంటే హీరోయిన్‌గా ఎంతో కష్టపడి పైకొచ్చింది అన్న మాటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కమల్ హీసన్ తనయ అయినా కానీ ఆమెకు మొదట్లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. పవన్ కళ్యాణ్‌తో ఆమె నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆమె కెరీర్‌ని టర్న్ చేసింది. అక్కడి నుండే శృతి అందరి దృష్టిలో పడింది. పెద్ద ప్రాజెక్టులను దక్కించుకుని సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. శృతిహాసన్ ఓ మంచి నటి, మంచి డాన్సర్, సింగ్ అని తెలుసు. కానీ ఆమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అదే రచయిత. శృతిహాసన్ అప్పుడప్పుడూ చిన్న చిన్న కవితలూ, స్టోరీలు రాస్తూ ఉంటుంది. గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి తనే డైరెక్షన్ చేస్తూ నటించింది కూడా. ఆ తరహాలోనే ఆమె రాసుకునే స్టోరీలకి చాలా పెద్ద లిస్టే ఉందట. ఎప్పుడో ఒకప్పుడు ఆ స్టోరీల లిస్టులోంచి ది బెస్ట్ ఒకదాన్ని బయటికి తీసి తెరపై ఆవిష్కరించేస్తానంటోంది శృతి. ఏమో శృతిహాసన్‌కి ఉన్న టాలెంట్‌కి సినిమాని డైరెక్ట్ చేసే సత్తా లేకపోలేదు. ఎందుకంటే ఆమె విశ్వనటుడు కమల్ హాసన్ తనయ కదా. ప్రస్తుతం ఆమె 'పవన్ కళ్యాణ్'తో కాటమరాయుడు' సినిమాలో నటిస్తోంది. తండ్రితో కలిసి నటిస్తోన్న 'శభాష్ నాయుడు' సినిమా ఒకటి ఆమె చేతిలో ఉంది. ఇది బైలింగ్వల్ మూవీ. బాలీవుడ్‌లో కూడా శృతి జోరు ప్రదర్శించింది కానీ ఇప్పుడు ఆమె జోరు కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. కానీ చేతి నిండా సినిమాలతో ఊపిరి సలపకుండా, ఏదో ఒక సినిమాలో నటించేశాంలే అనుకుంటే మజా ఏముంది. ఆలోచించి ఆడుగులు వేయడంలో తప్పేముంది అంటోంది ముద్దుగుమ్మ శృతి.