కరోనా భయాలు తొలగి సంక్రాంతి సీజన్‌లో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. సాధారణ సంక్రాంతి తరహాలోనే సినిమాలూ విడుదలయ్యయి.. అయితే, సగం సీట్ల సామర్థ్యం.. అనేదే కాస్త కొత్త వ్యవహారమిక్కడ. ఆ సంగతి పక్కన పెడితే, సంక్రాంతి సినిమాలు మూడూ ప్రేక్షకుల్ని టాక్‌తో సంబంధం లేకుండా అలరించాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. వీటిల్లో ‘అల్లుడు అదుర్స్’ కాస్త వెనకబడింది.
రేసులో రవితేజ ‘క్రాక్’ బాగా సందడి చేస్తోంది. ‘రెడ్’ కాస్త లేటుగా వచ్చినా, ఘాటై కలెక్షన్లను సాధిస్తోంది. హీరోల సంగతి పక్కన పెడితే, హీరోయిన్లలో శృతిహాసన్‌కి ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాతి సందడి నభా నటేష్‌దే. మాళవిక శర్మ, అమృత అయ్యర్, అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా పేతురాజ్ మమ అన్పించారు. వీరిలో అనూ ఇమ్మాన్యుయేల్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇక, శృతి హాసన్ విషయానికొస్తే, ఆమెకు గ్రాండ్ రీ-ఎంట్రీ లభించింది ‘క్రాక్’ సినిమాతో.
‘నేనూహించినదానికంటే ఎక్కువ అభిమానం ఈ సినిమాతో మళ్ళీ దొరికింది..’ అంటూ శృతిహాసన్ ‘క్రాక్’ సక్సెస్ గురించీ, తన కెరీర్ గురించీ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘క్రాక్’ రిలీజ్‌కి ముందు నుంచే శృతి సందడి మొదలయ్యింది సోషల్ మీడియాలో. మేగ్జిమమ్ వాడేసుకుంది సోషల్ మీడియాని ‘క్రాక్’ ప్రమోషన్ల విషయమై ఈ అందాల భామ. పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే.