శ్వేతా బసు ప్రసాద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'ఎ..క్క..డా..' అంటూ 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ. అయితే, ఆ క్రేజ్ ఎంతో కాలం నిలవలేదు. స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న శ్వేతా కెరీర్‌లో ఊహించని ఎన్నో సంఘటనలు, పర్సనల్ లైఫ్‌నీ చిందరవందర గందరగోళం చేసేశాయి. దాంతో కెరీర్ మధ్యలోనే ముగిసిపోయింది. తర్వాత కొన్నాళ్లు బాలీవుడ్ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్‌తో ప్రేమ ప్రయాణం సాగించి, ఆయన్నే వివాహం చేసుకుంది. అయితే, ఆ ముచ్చట కూడా ఎన్నాళ్లో నిలవలేదు. పెళ్లయిన సంవత్సరానికే మిట్టల్‌తో విడాకులు తీసుకుంది. అంటే గతేడాదిలోనే. స్నేహ పూర్వకంగానే మేమిద్దరం విడిపోతున్నామంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.
అయితే, తాజాగా ఈ పాప తన లవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రొఫిషనల్‌గా తన మాజీ భర్త మిట్టల్‌ని ఎప్పుడూ అభిమానిస్తానని చెప్పుకొచ్చింది. అయితే, కెరీర్ పరంగా పర్సనల్ రిలేషన్‌షిప్ కొనసాగించలేకపోయామని చెప్పింది. అయితే, ఇన్ ఫ్యూచర్ మళ్లీ ప్రేమలో పడే అవకాశాలున్నాయనీ, తన అభిప్రాయాల్ని నచ్చిన వ్యక్తి తారసపడితే, ఏమో ఆయనతో ప్రేమలో పడతానేమో అని చెప్పిన శ్వేత.. మాటలకు నెటిజన్లు వాపోతున్నారు. నిన్న విడాకులు.. ఈ రోజు మళ్లీ ప్రేమ గుసగుసలా.? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టిన శ్వేతా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్య కాస్త బొద్దుగా మారిన శ్వేతా కష్టపడి వర్కవుట్స్ చేసి, జీరోసైజ్ ఫిగర్‌ని సంపాదించింది. ఫిగర్ సరే, ఛాన్సులో మరి.