వాట్‌ ఏ హాట్‌నెస్‌ బేబ్స్‌!

By iQlikMovies - May 25, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

'పైసా' సినిమాతో కొంచెం బొద్దుగా, కొంచెం ముద్దుగా అందాలారేసిన ముద్దుగుమ్మ సిద్దిఖా శర్మ. నాని సరసన కొంచెం బొద్దుగా కనిపించినా, ఓ సాంగ్‌లో హాట్‌ హాట్‌గా బికినీ అందాలారేసి, సాలిడ్‌ గ్లామర్‌తో కిక్కెక్కించింది. కుర్రోళ్లను తన మత్తులో దించేసింది. కుర్రోళ్లయితే అమ్మడి గ్లామర్‌కి ఫ్లాట్‌ అయిపోయారు కానీ, ఎందుకో దర్శక, నిర్మాతలు మాత్రం అమ్మడి అందచందాల్ని అస్సలు పట్టించుకోలేదు పాపం. ఎట్టకేలకు ఇటీలే ఓ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో సిద్దిఖా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం సిద్దిఖా కాస్త బరువు కూడా తగ్గించేసిందట. చక్కనమ్మలు సన్నజాజి తీగల్లా ఉంటేనే కదా అందం, ఆకర్షణ. సో ఈ బ్యూటీ ఇప్పుడు మరింత ఆకర్షించేలా మారిపోయిందట. డెబ్యూ హీరో అమన్‌తో కలిసి సిద్ధిఖా ఇంకెలాంటి గ్లామర్‌ సునామీ సృష్టించిందో తెలియాలంటే ఈ కొత్త సినిమా ఏదో విడుదల కావాలి. అప్పుడు కానీ తెలియదంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS