'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'.. సిరాశ్రీ అక్షరం, బాలు గానామృతం!

By iQlikMovies - November 13, 2018 - 17:08 PM IST

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి సంబంధించి తాజాగా ఓ పాట రికార్డింగ్‌ పూర్తయ్యింది. చెన్నయ్‌లో ఈ పాటని రికార్డ్‌ చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటని ఆలపించగా, సినీ గేయ రచయిత, రాంగోపాల్‌వర్మ ఆస్థాన 'కవి'గా సుపరిచితుడైన సిరాశ్రీ ఈ పాటని రచించారు. 

గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఎలాగైతే భావిస్తారో, తాము రాసిన పాట బాలు నోట విన్పిస్తే.. ఆ పాటకి అలా గొప్పతనం వస్తుందని గీత రచయితలు భావిస్తుంటారనీ, ఆ అదృష్టం తనకు ఇలా వరించిందని గేయ రచయిత సిరాశ్రీ అంటున్నారు. కళ్యాణి మాలిక్‌ సంగీతం అందించారు ఈ పాటకి. 

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి సంబంధించి అత్యంత కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందట. 'ఇలాంటి పాట పాడుకోవడానికి ఏడాదికి ఒకటి వచ్చినా చాలు. ఇది వేదికల మీద పాడుకోదగ్గ పాట' అని గాన గంధర్వుడే అన్నారంటే, ఈ పాట ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మెలోడియస్‌గా రూపొందిన ఈ పాట, సినిమా చూసిన ప్రతి ఒక్కర్నీ కట్టి పడేస్తుందట. 

ఇదిలా వుంటే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతోంది. యూ ట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోన్న ఓ వ్యక్తి అచ్చం చంద్రబాబులా వుండటంతో, అతన్ని సంప్రదించి, అతనితోనే టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రని వేయించి.. ఆ పాత్రతో భళా అన్పించుకోనున్నాడట ఆర్జీవీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS