స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ చూస్తుంటే 'సీతా రామం' అనేది యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమక అని అర్థం అవుతోంది.
ఈ ట్రైలర్ రామ్ , సీతల మధ్య ప్రేమకథను అవిష్కరిస్తోంది. ఒక ఉత్తరాన్ని సీతా మహాలక్ష్మి కి అందజేయడానికి రష్మిక మందన్నా ఇండియాకి బయలుదేరడంతో ట్రైలర్ ప్రారంభమైంది. తరుణ్ భాస్కర్ సహాయంతో సీత ని వెతుకుతోంది రష్మిక. రామ్ గురించి తెలుసుకుంటే.. ఆమెని పట్టుకోవడం ఈజీ అవుతుందని భావిస్తుంది. 1965లో లెఫ్టినెంట్ గా ఉన్న రామ్ (దుల్కర్ సల్మాన్), సీత (మృణాల్ ఠాకూర్) మధ్య ఒక అందమైన ప్రేమ కథ నడిచిందనే విషయాన్ని తెలుసుకుంటుంది. చివరికి రష్మిక ఆ లెటర్ ను సీతా మహాలక్ష్మికి అందజేసిందా లేదా? అది రాసింది ఎవరు? అందులో ఏముంది? అసలు సీతా రామ్ కు ఏమైంది? చివరకు వారి ప్రేమకథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది,