తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారసులకి కొదువలేదు. ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలలో వారసుల సంఖ్యనే ఎక్కువ!
ఈ వారసుల జాబితాలో మరొక నటుడి కుమారుడు చేరనున్నాడు. వివరాల్లోకి వెళితే- నటుడు, మా అధ్యక్షుడైన శివాజీరాజ కుమారుడు విజయ్ తెరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే నటనకి సంబందించిన పలుచోట్ల శిక్షణ తీసుకున్నాడు.
ఇదే విషయాన్ని శివాజీరాజ కూడా చెబుతూ- మంచి కథల కోసం వెతుకుతున్నాము, అన్ని కలిసి వస్తే త్వరలోనే తన కొడుకు మొదటి చిత్రం ఉండబోతోంది. ఇక విజయ్ తన తండ్రి అయిన శివాజీతో కలిసి శ్రీకాంత్ హీరోగా వచ్చిన విరోధి చిత్రంలో నటించడం జరిగింది.
మరి చూద్దాం.. ఈ వారసుడి భవితవ్యం ఎలా ఉండనుందో!