మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరవ్‌ు తేజ్ తన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం విదితమే. కోరోనా తర్వాత సినిమా హాళ్ళలో విడుదలయ్యే తొలి సినిమా ఇది. ఈ రిలీజ్ కోసం ఇటు సినీ ప్రముఖుల, అటు ప్రేక్షకులూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తొమ్మిది నెలల తర్వాత సినిమా ది¸యేటర్లలో ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం రాబోతోంది. అదీ కరోనా భయాందోళనల నడుమ. ‘సెకెండ్ వేవ్ వచ్చే అవకాశం వుంది’ అనే కరోనా హెచ్చరికల నడుమ, డిసెంబర్‌లో నిజంగానే ఈ సినిమా ది¸యేటర్లలో విడుదలవుతుందా.? లేదా.? అన్న విషయమై సస్పెన్స్ ఇంకా అలాగే వుంది. మరోపక్క ‘జీ’ సంస్థ, ఈ సినిమా రిలీజ్ హక్కుల్ని సొంతం చేసుకోవడం మరో ఆసక్తికరమైన పరిణామం. ఒకవేళ సినిమా ది¸యేటర్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విడుదలై, హిట్టు కొడితే మాత్రం.. సాయి ధరవ్‌ు తేజ్ కెరీర్‌లోనే దీని వెరీ వెరీ స్పెషల్ ఫిలింగా భావించాల్సి వుంటుంది. నిజానికి, ఈ రిస్క్ తీసుకోవడానికి టాలీవుడ్ నుంచి ఏ హీరో ఇప్పటిదాకా ముందుకు రాలేదు. ఏ నిర్మాత కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడటంలేదు. ఇటు మేకర్స్, అటు హీరో.. ఇంత పెద్ద రిస్క్ చేస్తున్న దరిమిలా, ఈ రిస్క్‌కి కరోనా సమస్యగా మారకూడదనే ఆశిద్దాం. తెలుగు సినిమా స్టామినాకే ఇది అసలు సిసలు పరీక్ష. ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిజల్ట్‌తోనే సంక్రాంతి సినిమాల జాతకం కూడా ఆధారపడి వుంటుంది మరి.