తెలుగులో 'రెయిన్బో' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. 'లెజెండ్' సినిమాలో బాలయ్యతో జత కట్టింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం అమ్మడికి మొహమాటం లేదు. ఈ ముద్దుగుమ్మ చేసిన పాత్రల్లో అన్నీ గ్లామరస్ పాత్రలే. అనుష్క నటించిన ప్రయోగాత్మక చిత్రం 'సైజ్ జీరో'లో టైటిల్ సాంగ్‌లో ఆడిపాడింది. పాటలో అమ్మడి హాట్నెస్ తట్టుకోవడం కత్తి మీద సామే అయ్యింది కుర్రకారుకి. నందమూరి బుల్లోడు కళ్యాణ్‌రామ్‌తో 'షేర్' సినిమాలోనూ నటించింది. పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కేవలం గ్లామర్ డాళ్‌గానే తెలుగులో పాపులర్ అయ్యింది. అలాగే బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తాజాగా అమ్మడి పెళ్లి న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సీనియర్ నటి కుమారుడితో పీకల్లోతు లవ్‌లో ఉందంటూ గాసిప్స్ వస్తున్నాయి చాలా కాలంగా. అయితే ఆ గాసిప్స్ ఇప్పుడు నిజమయ్యేలానే ఉన్నాయి. ఎందుకంటే అమ్మడు ప్రేమలోనే కాదు, పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యుని సోనాల్ పెళ్లి చేసుకోబోతోందట. బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. కానీ ఏమో అమ్మడి జోరు చూస్తుంటే జరిగినా జరగొచ్చుననిపిస్తోంది.