సింగర్ సోను నిగమ్ ఈ మధ్యలో తరుచుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
ముస్లింలు పాటించే ‘అజాన్’ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అది ఎంతవరకు వెళ్లిందంటే అయన శిరోమండనం చేసుకునే వరకు. ఇక ఆ వివాదం తరువాత, ఆయన పై ట్విట్టర్ లో అనుకూల-వ్యతిరేఖ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రావడం మొదలయ్యింది.
అయితే వీటన్నిటి ప్రభావమో ఏమో తెలియదు కాని, ఆయన ఈ రోజు ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తునట్టు ప్రకటించడం అందరికి షాక్ కలిగింది. మరి చెప్పిన దాని ప్రకారం ఆయన ట్విట్టర్ నుండి బయటకి వచ్చేస్తాడో లేదో చూడాలి.