కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకుని, రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పుడు ఆయన్నే కరోనా సోకింది. అవును.. సోనూసూద్ కోవిడ్ బారీన పడ్డారు. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనూ ముంబైలో తన నివాసంలోనే ఉన్నారు. నిన్నటి వరకూ ఆయన `ఆచార్య` షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయనపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. తన షెడ్యూల్ అయిపోవడంతో ముంబై వెళ్లిపోయారు. అక్కడ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే పాజిటీవ్ గా తేలింది.
సోనూకి కరోనా సోకడంతో ఇప్పుడు ఆచార్య టీమ్ హై టెన్షన్ లో పడింది. సోనూతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు కోరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆచార్య షూటింగ్ కి శుక్రవారంతో బ్రేక్ పడింది. మళ్లీ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలెడతారో చూడాలి.