ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటిల పైన సోషల్ మీడియాలో వదంతులు రావడం చాలా సాధారణ విషయంగా మారిపోయింది.
ఇటువంటి వార్తలతో చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ జాబీతాలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో చేరిపోయారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదంటూ అందుకోసమే తాను చేయవలసిన షోలను క్యాన్సిల్ చేసుకుంటునట్టు వార్తలు వచ్చాయి.
అయితే వీటన్నిటి పైన స్వయంగా ఆయనే ఓ వీడియో ద్వారా స్పందించాడు. తన సోదరి గిరిజ పోయిన నెల 23వ తేదిన కన్నుమూయడంతో తాను భాధలో తన కుటుంబంతో ఉండిపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు రద్దు చేయడానికి కారణం అని అలాగే కొద్దిగా జ్వరం, దగ్గుకి డాక్టర్ ని కలవడం ఇటువంటి పుకార్లకీ దారిచూపింది అని తెలిపారు.
వీటన్నిటిలో ఏవి నిజం కాదు అని తాను ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో స్వరాభిషేకం షూటింగ్ లో ఉన్నట్టు వివరించారు.