`స్పైడర్`తో తమిళ నాట అడుగుపెట్టాడు మహేష్‌బాబు. ఇదే తొలి తమిళ సినిమా కాబట్టి ప్రచారం కూడా జోరుగా చేశాడు. ఆడియోని అక్కడే రిలీజ్ చేసి, ఆ వేడుకలో తమిళంలో మాట్లాడి - ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. మురుగదాస్‌ని దర్శకుడిగా ఎంచుకోవడం, ఎక్కువ మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు అక్కడి వారే కావడంతో 'స్పైడర్'పై తమిళ జనాలకు బాగానే గురి కుదిరింది.
తమిళ హక్కుల్ని ఏకంగా రూ.18 కోట్లకు అమ్మారు కూడా. అయితే... 'స్పైడర్'కు తెలుగులో అనుకొన్న ఫలితం రాలేదు. తమిళంలోనూ అంతే. ఈ సినిమాకి అక్కడ రూ.18 కోట్లకు కొనుగోలు చేస్తే... ఇప్పటి వరకూ రూ.9.5 కోట్లు మాత్రమే వచ్చాయట. ఈ సినిమా రూ.10 కోట్ల మార్క్ చేరుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోంది. అంటే.. తమిళంలోనే రూ.8 కోట్ల వరకూ నష్టాలు చూడాల్సివస్తోందట. ఓవరాల్ గా ఈ సినిమాని కొన్న ప్రతీ బయ్యరూ నష్టపోవాల్సిందేనని, మొత్తమ్మీద రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకూ నష్టాలు కనిపించొచ్చని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి.