శ్రీలీల మంచి ఫామ్ లో ఉంది. సాధారణంగా దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే పాలసీ ఫాలోను అయ్యేవారు ఎడా పెడా ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ క్రేజ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. అందుకే హిట్ ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా సినిమాలు, యాడ్స్, రిబ్బన్ కట్టింగ్స్, అని క్యాష్ చేసుకుంటారు. కానీ ఈ విషయం లో శ్రీలీల చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన కున్న క్రేజ్ ని వినియోగించుకుని, డబ్బే ముఖ్యం అని , తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని, తెలుస్తోంది.
శ్రీలీల పారితోషికం 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటోందని సమాచారం. అంతే కాక ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన కొన్ని ఆఫర్స్ ని తిరస్కరించిందని టాక్. బెట్టింగ్ యాప్ లకు, మద్యం బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసే ఆఫర్ వస్తే, ఇలాంటివి చేయనని నిక్కచ్చిగా ఆ ఆఫర్లకు నో చెప్పిందని సమాచారం. భారీ పారితోషికం ఇస్తామన్నా నో చెప్పిందట.
ఈ విషయం బయటికి రావటంతో శ్రీలీల డెడికేషన్ ని, రూల్స్ ను అంతా ప్రశంసిస్తున్నారు. శ్రీలీల భవిష్యత్తులో కూడా ఇలాంటి నిబంధనలు ఫాలో అవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.