బాలీవుడ్ కి పయనమయిన మరో హీరోయిన్

మరిన్ని వార్తలు

కన్నడ కస్తూరి శ్రీలీల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు అందం అభినయంతో వరస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 2022 -23 లలో శ్రీలీల సినిమాలు రెండు నెలలకి ఒకటి వచ్చేది. కొన్ని డిజాస్టర్ల వలన ఆమె క్రేజ్ అమాంతం పడిపోయింది. అప్పటివరకు ఆమె కాల్షీట్స్ కోసం తిరిగిన నిర్మాతలు ఒక్కసారిగా శ్రీలీలని పట్టించుకోవటం మానేశారు. ఒకటి రెండు సినిమాలనుంచి తప్పించారు కూడా, దీనితో సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చి, చదువుపై శ్రద్ద పెట్టింది. మళ్ళీ ఇప్పుడు శ్రీలీలని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి.  


ఇప్పటివరకు తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ నే నమ్ముకున్న శ్రీలీల ఇప్పుడు మిగతా భాషలపై కూడా ద్రుష్టి పెట్టింది. తెలుగులో రవి తేజ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇది కాక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంకొక సినిమా చేస్తోందని టాక్. వీటితో పాటు తమిళం, మలయాళంలో ఛాన్స్ లు అందుకుంటున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ భామలు సౌత్ కి దిగుమతి అయితే, ఇప్పుడు పరిస్థితి మారి సౌత్ భామలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.ఇప్పటికే సమంత, నయనతార, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ సూపర్ హిట్స్ కొట్టి బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నారు. లేటెస్ట్ గా సాయి పల్లవి,  కీర్తి సురేష్, డెబ్యూ కి రెడీ అయ్యారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఈ లిస్ట్ లో చేరింది. 


శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇబ్రహీం ఇప్పటికే బాలీవుడ్ లో వర్క్ చేస్తున్నాడు. ఒక వైపు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ, త్వరలో హీరోగా మారనున్నాడు. ఈ సినిమాకి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల ఎంపిక అయినట్టు సమాచారం. ఈ ఛాన్స్ తో శ్రీలీల కెరియర్ మళ్ళీ పుంజుకోవటం గ్యారంటీ అంటున్నారు సినీ క్రిటిక్స్. బాలీవుడ్ డెబ్యూతో హిట్ కొట్టి శ్రీలీల అక్కడే సెటిల్ అయిపోతుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS