బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి బోలెడంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ని బిగ్ స్క్రీన్ కోసం వాడుకునే సాహసం చేయలేదింతవరకూ శ్రీముఖి. ఏవో అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ వాటిలో ఒక్క సినిమా కూడా శ్రీముఖి కెరీర్‌కి ఉపయోగపడింది లేదు. ఈ మధ్య శ్రీముఖి సోషల్ మీడియాలో చేస్తున్న అందాల రచ్చ చూస్తుంటే, ఆమెకేదో జాక్ పాట్ తగిలినట్లే అనిపిస్తోంది. లేదంటే, జాక్‌పాట్ కొట్టడం కోసమే అలా అందాల ఆరబోసేసేస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బుల్లితెరపై పొట్టి పొట్టి డ్రస్సులేసుకుని, కుర్రకారుకు గట్టిగా కిర్రాకు పుట్టించడంలో శ్రీముఖిది అందె వేసిన చెయ్యి. అయితే, ఆమె బొద్దు అందాలకు ఆడియన్స్‌తో పాటు, ఆమెకే బోర్ కొట్టేసింది కాబోలు. స్లిమ్ లుక్స్‌లో శ్రీముఖిని చూడాలని ఉందన్న తమ కోరికను బయట పెట్టారో ఏమో.. ఫ్యాన్స్ కోసం శ్రీముఖి కాస్త అడ్వాన్స్ అయినట్లు కనిపిస్తోంది. కాస్త స్లిమ్‌గా కనిపిస్తోంది.
ఆ స్లిమ్ లుక్స్‌లో హాట్ అప్పీల్ కూడా ఇస్తోంది. రాములమ్మలా ఉంటేనే కేక పుట్టించేసే శ్రీముఖి ఇక స్లిమ్‌గా మారి, గ్లామర్ కంచె తెంచేస్తే కుర్రోళ్ల దూకుడుకు కళ్లెం వేసేదెలా.? తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన పిక్‌కి అలాంటి రెస్పాన్సే వస్తోంది మరి. డార్క్ మెరూన్ కలర్ కాస్ట్యూమ్‌లో వైట్ కలర్ స్కిన్ టోన్‌తో బొద్దు బొద్దుగా థైస్ ని ఎక్స్‌పోజ్ చేస్తూ, కసి కసిగా చూపులు విసురుతుంటే.. అబ్బో ఆలస్యం చేయక ఈ పోజు చూసేయండిక.