బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా వెలిగిపోతోన్న ముద్దుగుమ్మ శ్రీముఖి. వెండితెర పైనా సినిమాలతో బిజీగా గడుపుతోంది. శ్రీముఖి హీరోయిన్‌గా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. హీరోయిన్‌గానే కాదు, హీరో చెల్లెలు, తదిరత డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్‌లోనూ శ్రీముఖి చక్కగా ఒదిగిపోతూ ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ విషయంలో శ్రీముఖికి కొన్ని హద్దులున్నాయంటోంది. అవసరం మేరకే హాట్‌గా కనిపిస్తానంటోంది. ఫిజిక్ విషయంలోనూ అమ్మడికి కొంత ఐడియా ఉంది. సినిమాల్లో నాజూగ్గా, ఫిట్ గ్లామర్‌తో కనిపించే శ్రీముఖి బుల్లితెరపై కొంచెం బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. బుల్లితెర రాములమ్మా అని ఈ ముద్దుగుమ్మని ముద్దుగా పిలుచుకుంటూంటారు ఆడియన్స్. తాజాగా ఈ ఫోటోలోని బ్లాక్ కాస్ట్యూమ్‌లో శ్రీముఖి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇటు బుల్లితెరనూ, అటు వెండితెరనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ, తనదైనా శైలిలో గ్లామర్ ప్రపంచలో వెలిగిపోతోందీ బ్యూటీ.