శ్రీముఖికి సల్మాన్‌ఖాన్‌ ఇన్‌స్పిరేషన్‌

మరిన్ని వార్తలు

శ్రీముఖికి సల్మాన్‌ ఖాన్‌ ఇన్‌స్పిరేషనా! దేనిలోనని ఆశ్చర్యపోతున్నారా? పెళ్లి విషయంలోనట. అంటే సల్మాన్‌లాగే శ్రీముఖి కూడా పెళ్లి చేసుకోదా అనుకుంటున్నారా? ఏమో కానీ, శ్రీముఖిని పెళ్లెప్పుడంటే, ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదనీ చెబుతూనే, అయినా కానీ హీరోయిన్స్‌నే పెళ్లి విషయంలో ఎందుకు సతాయిస్తారు. హీరోలను ఎందుకు ప్రశ్నించరు అని తిరిగి ప్రశ్న సంధించింది ఈ ముద్దుగుమ్మ.  

ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా వెండితెరపై అవకాశాలను దక్కించుకుంటోంది. శ్రీముఖి హీరోయిన్‌గా పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో బుల్లితెర నటుడు హర్షవర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా ఒకటి. 'కుటుంబ కథాచిత్రమ్‌' అనే ఓ హారర్‌ మూవీ ఒకటి. నందు, కమల్‌ కామరాజ్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. ఈ మధ్యనే విడుదలైన టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. భార్య, భర్త, ఓ వాచ్‌మేన్‌.. వీరి మధ్య జరిగే స్టోరీని సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇలా అమ్మడు పలు చిత్రాలతో వెండితెరపై బిజీగా ఉంది. అలాగే బుల్లితెరపై అమ్మడు ఎప్పుడూ బిజీనే. బుల్లితెర రాములమ్మగా తన యాంకరింగ్‌తో దూసుకెళ్లిపోతోంది. 

ఇదిలా ఉండగా, సోషల్‌ మీడియాలోనూ ఈ బొద్దు బ్యూటీ సూపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కమెడియన్‌ వెన్నెల కిషోర్‌తో శ్రీముఖి సరదా సరదాగా ఛాట్‌ చేసింది. వెన్నెల కిషోర్‌ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసి, 'మై కరేబియన్‌.. మై కామారెడ్డి..' అని క్యాప్షన్‌ ఇచ్చారు. అందుకు శ్రీముఖి స్పందిస్తూ 'మనది' అని ట్వీట్‌ చేసింది. మధ్యలో ఓ అభిమాని శ్రీముఖి మీ యాంకరింగ్‌ చాలా బావుంటుందని ట్వీట్‌ చేశాడు. అందుకు వెన్నెల కిషోర్‌.. ఆమెకేంటి ఆమె రాక్‌ స్టార్‌.. అన్నాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య ఛాటింగ్‌ ఫన్నీ ఫన్నీగా సాగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS