శ్రీముఖి ఆర్మీ మొదలైపోయిందోచ్‌!

మరిన్ని వార్తలు

బుల్లితెర పిచ్చి అరుపుల రాములమ్మ శ్రీముఖికి సోషల్‌ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫాలోయింగ్‌ అంతా ఇప్పుడు ఆర్మీలా ఫామ్‌ అయిపోయింది. ఆర్మీ ఏంటీ.? అనుకుంటున్నారా.? అవునండీ శ్రీముఖి 'బిగ్‌బాస్‌' సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా వెళ్లబోతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్పుడే ఆమె కోసం ఆర్మీ సిద్ధమైపోయింది.

 

అదేనండీ కౌషల్‌ ఆర్మీలా అన్నమాట. అప్పుడంటే ఒకే ఒక్కడు. కౌషల్‌ ఆర్మీ. కానీ, ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్స్‌కి 14 ఆర్మీలు సిద్ధంగా ఉన్నాయట. కొన్ని పెయిడ్‌ ఆర్మీలైతే, ఇంకొన్ని జెన్యూన్‌ ఆర్మీలు కూడా ఉన్నాయంటున్నారనుకోండి. ఇకపోతే, మన శ్రీముఖికి మాత్రం కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్‌ ఉన్న మీదట. అప్పుడే ఆమె కోసం ఫేస్‌ బుక్స్‌, ట్విట్టర్‌లు, ఇన్‌స్టాగ్రాములూ, ఈ చెత్తా, ఆ చెత్తా అనే తేడా లేకుండా, దబ్బిడి ముబ్బడిగా ఆర్మీలు పుట్టుకొచ్చేశాయట.

 

ఇంకా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో పక్కా ఇన్‌ఫర్మేషన్‌ లేనే లేదు. కానీ, శ్రీముఖి ఆర్మీ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి మాత్రం మొదలైపోయింది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో తరచూ శ్రీముఖి హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోతూ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పెచ్చుబాటు అంతా బిగ్‌బాస్‌ ఎట్రాక్షన్‌ కోసమే అనే టాక్‌ కూడా ఉంది. ఏమో, ఈ ప్రచారం నిజమై, ఈ హడావిడి చూస్తుంటే, నిజంగానే శ్రీముఖి బిగ్‌బాస్‌ స్టార్ట్‌ అవ్వక ముందే సంచలనం అయిపోయేలా కనిపిస్తోంది. బుల్లితెర రాములమ్మనా.. మజాకానా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS