'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' ఓ చిన్న సినిమా. అందరి నోట్లోనూ నలుగుతోందిప్పుడు. సాధారణంగా ఇలాంటి సినిమాలని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా విడుదలకు కొద్ది ముందు ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు. ఏ సినిమా అయినా విజయం సాధించాలంటే ప్రమోషన్ ముఖ్యం. అయితే ఈ సినిమాకి చేసిన పబ్లిసిటీ అంతగా సరిపోలేదు. కానీ మా సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి చెప్పండంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి, స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేసింది ఈ చిత్ర యూనిట్. దాంతో సినిమాలో ఏముందోనంటూ జనం ఈ సినిమా వైపు కొంచెం ఎట్రాక్ట్ అయ్యారు. మొత్తానికి సినిమా అయితే బావుందంటున్నారు. అయితే నటీనటులు తెలియని వాళ్లు కావడం ఈ సినిమా ఓ మైనస్‌గా చెప్పొచ్చు. సినిమాకి చేసిన ప్రమోషన్ తీరు బావుంది కానీ, మరికొంచెం ప్రమోషన్ ఎక్కువ చేసుంటే ఇంకా బాగా ఫలితం దక్కేది. ఏదేమైన ఓ చిన్న సినిమా ఇలా చర్చల్లోకి వచ్చిందంటే అది ఆ డైరెక్టర్ క్రెడిట్ ఒక ఎత్తు కాగా, మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా మరో ఎత్తు అని చెప్పక తప్పదు. అయినా కానీ ప్రేక్షకులు ఇదివరకటిలా కాదు, కొత్త దనం వైపు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఆ మార్పే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండి సక్సెస్ బాట పట్టేందుకు కారణం అవుతుంది. అలాగే గతంలో 'పెళ్లి చూపులు' సినిమా విజయం సాధించేందుకు కారణం అయ్యింది.