'కత్తి మహేష్ ఒక వీధి కుక్క. దేవుడు అనేది నమ్మకం. నీకు నమ్మకం లేకపోతే మూసుకుని కూర్చో. మా నమ్మకాల మీద కామెంట్స్ చేసే అధికారం లేదు నీకు. ఊర పందిలా పెద్ద పొట్టేసుకుని లింగు లింగుమంటూ తిరిగే పొట్టినా డాష్.. అని ట్విట్టర్‌లో కత్తి మహేష్‌ని తిట్టేసింది. తిట్టింది ఎవరో చెప్పాలా? ఈపాటికే అర్ధమై పోయుంటుంది.
ఇంత ఘాటుగా తిట్టడం అనేదే పెద్ద పనిగా పెట్టుకున్నదెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హా.! అవును మీ గెస్ కరెక్టే. శ్రీరెడ్డి. ఒప్పుకుంటారు కదా శ్రీరెడ్డి తిట్టిందన్న సంగతి. అయితే ఈ ఘాటు భామ ఇప్పుడు ప్లేట్ మార్చేసింది. ట్విట్టర్‌లో ఫుల్‌గా తిట్టేసి, ఫేస్‌బుక్‌లో నేనా.? కత్తి మహేష్‌నా.? అస్సలు తిట్టలేదంటోంది. ఏది నమ్మాలి మరి. ట్విట్టర్‌ని నమ్మాలా? ఫేస్‌బుక్‌ని నమ్మాలా? శ్రీరెడ్డి తిట్టడాన్ని అయితే నమ్మాలి.
మరెందుకు ప్లేటు మార్చేయడం. అది కూడా అక్కడోలాగా? ఇక్కడోలాగా? ఎందుకీ దాగుడుమూతలు శ్రీరెడ్డి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య హిందూ దైవమైన రాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్మిలా హిందూ సంఘాలు ఆయనపై కేసుల నమోదు చేయడం, పోలీసులు అరెస్టు చేయడం, విచారణ చేసి, వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టడం ఇదంతా తెలిసిన సంగతే.
ఈ ఇష్యూ పైనే మన శ్రీరెడ్డి గారు పై విధంగా స్పందించారు మరి.