శ్రీరెడ్డి లీక్స్ ఇప్పుడు కోలీవుడ్‌ని తాకాయి. మొన్నటి దాకా తెలుగులో తెలుగమ్మాయిలకే అవకాశాలివ్వాలనీ, కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావట్లేదనీ, పలానా డైరెక్టర్లు. పలానా నిర్మాతలు, పలానా హీరోలు తనను పలు రకాలుగా వేధించారంటూ నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ టాలీవుడ్ పరువు రచ్చకీడ్చింది.
అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాను భ్రష్టు పట్టించేసింది. దీనివల్ల ఆమెకు ఒరిగిందేమీ లేకపోవడంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండి మళ్లీ ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఇప్పుడు శ్రీరెడ్డి కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తనకు అవకాశాలిస్తానని చెప్పి మోసగించాడనీ, ఆయన తెలుగులో కూడా పలు చిత్రాలు చేశాడనీ డైరెక్టర్‌పై ఆరోపణల వర్షం కురిపించిన శ్రీరెడ్డి, ఇప్పుడు ఓ హీరోని తగులుకుంది.
ఆ హీరో ఎవరో కాదు, శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అన్న మాట. ఈయన తెలుగోడే కానీ, తమిళంలో స్థిరపడ్డాడు. ఇప్పుడీ హీరోని తన 'ఛీ లీక్స్'లోకి లాగేసింది శ్రీరెడ్డి. శ్రీరామ్ ఓ హోటల్లో తనతో కలసి ఎంజాయ్ చేశాడనీ, అవకాశాలిస్తానని మోసం చేశాడనీ పేర్కొంది. అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో ఆయనపై ధూషణలు చేసింది. శ్రీకాంత్ ఫోటో, పేరు విడుదల చేస్తూ ఈ అసభ్యకరమైన స్టోరీ అల్లింది శ్రీరెడ్డి. అయితే వీటన్నింటికీ శ్రీరెడ్డి దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా అంటే వాటితో ఏమాత్రం పనిలేదీమెకు.
తనకు తోచిన విధంగా స్టోరీలు అల్లేసి, సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుందంతే. అసలు శ్రీరెడ్డితో, శ్రీరామ్‌కి లింకుందా? లేదా? అనే సంగతి పక్కన పెడితే, అలా ఇప్పుడీ తమిళ హీరో శ్రీరెడ్డి లీక్స్ వలలో పడిపోయాడు మరి.