నటి శ్రీదేవి మరణానికి కారణం ఏంటి అనేది దుబాయ్ పోలీసులు తేల్చేశారు.
అందరు అనుకుంటున్న విధంగా శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదు అని ‘ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం’ వల్ల జరిగిందంటూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ అందరిని షాక్ కి గురిచేస్తున్నది. అయితే ఆమె అలా మునిగిపోవడంతోనే ఆమెకి గుండెపోటు వచ్చి ఉండవచ్చు అని అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
ఇక ఈ రిపోర్ట్ కి సంబందించిన కాపీ ఒకటి మీడియా వద్దకి చేరింది. అందులో నీటిలో మునిగిపోవడం ద్వారానే జరిగింది అంటూ తేల్చి చెపుతున్నది. అలాగే ఆమె రక్తంలో కూడా ‘ఆల్కహాల్’ ఉన్నట్టు కూడా డాక్టర్లు గుర్తించారు.
ఈ రిపోర్ట్ వచ్చేసిన నేపధ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని ఇంకొన్ని గంటల్లోనే భారత్ కి పంపే అవకాశం ఉన్నట్టు అవకాశం ఉంది అని తెలుస్తున్నది.