తమిళంలో 'పులి' అనే సినిమాలో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి, తెలుగులో 'బాహుబలి' సినిమా కోసం అడిగితే చెయ్యనని చెప్పిందట. రమ్యకృష్ణ ఉండగా ఇంకొకరి కోసం ప్రయత్నించి తప్పు చేశానంటూ రాజమౌళి చెప్పడం వెనుక పెద్ద అర్థమే ఉందని ఇప్పుడే అందరికీ అవగతమవుతోంది. భారీ రెమ్యునరేషన్ అడగడం ద్వారా వచ్చిన మంచి ఛాన్స్‌ని శ్రీదేవి వదులుకుంది. ఇప్పుడు 'బాహుబలి' విజయంతో శ్రీదేవి తీవ్ర మనస్థాపానికి గురవుతోంది. పశ్చాత్తాపంతో విలవిల్లాడుతోందట. 'ఇంగ్లిష్ వింగ్లిష్' అనే సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, 'బాహుబలి' సినిమాలో చేసి ఉంటే అది ఆమెకు కెరీర్ బెస్ట్ రోల్ అయి ఉండేది. కొన్ని అవకాశాలు అంతే, చేజారితేగానీ వాటి విలువ తెలియదు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా 'బాహుబలి' లాంటి సినిమా ద్వారా వచ్చే పాపులారిటీ శ్రీదేవికి రాదు. 'నీలాంబరి' పాత్ర తర్వాత, 'శివగామి' పాత్ర తనకు అంతకు మించిన గుర్తింపు తెచ్చిందని రమ్యకృష్ణ చెబుతూ, ఇంకోసారి ఇలాంటి పాత్ర వస్తుందని తాను అనుకోవడంలేదని కూడా చెప్పిందామె. అది 'బాహుబలి'లోని 'శివగామి' పాత్ర గొప్పతనం. దేశమంతా 'బాహుబలి' సినిమా గురించీ, అందులోని 'శివగామి' పాత్ర గురించీ గొప్పగా చెప్పుకుంటోంటే, తానెంత పెద్ద తప్పిదం చేశాననే విషయం శ్రీదేవికి అర్థమవుతోందట. నష్టం జరిగిపోయింది, అది పూడ్చుకోవడం కష్టం. ప్రస్తుతం శ్రీదేవి 'మామ్' అనే సినిమాలో నటిస్తోంది.