ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు భాగాల‌తో..!

By Gowthami - July 19, 2021 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

ఇది వ‌ర‌కు ఓ సినిమా హిట్ట‌యితే.. పార్ట్ 2 వ‌చ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్నారు. బాహుబ‌లితో ఈ ట్రెండ్ మొద‌లైంది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా రెండు భాగాలుగా వ‌చ్చింది. కేజీఎఫ్ ఛాప్ట‌ర్ల పేరుతో విడిపోయింది. చాప్ట‌ర్ 1 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు చాప్ట‌ర్ 2పై దృష్టి ప‌డింది. పుష్ష కూడా రెండు భాగాలుగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఈ ట్రెండ్ తో చేతులు క‌లిపింది. అయితే ఈసారి రెండు కాదు.. ఏకంగా మూడు భాగాల‌తో రానుంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, కొత్త బంగారు లోకం చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఇప్ప‌డు నార‌ప్ప తీస్తున్నాడు.

 

త్వ‌ర‌లో `అన్నాయ్‌` అనే పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు శ్రీ‌కాంత్. అది ఏకంగా మూడు భాగాలుగా రానుంద‌ట‌. ఈ విష‌యాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల ధృవీక‌రించాడు కూడా. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. `నార‌ప్ప‌` త‌ర‌వాత‌... శ్రీ‌కాంత్ చేయ‌బోయే సినిమా ఇదే. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS