శ్రీమంతుడు చిత్ర కథను కాపీ కొట్టారు తన నవల అయిన ‘చచ్చేంత ప్రేమ’ నుండి కాపీ కొట్టారని అలాగే తనకు పేరు కూడా టైటిల్స్ లో వేయలేదని శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్ట్ ని ఆశ్రయించాడు.
దీనికి సంబందించి కిందటి నెలలో హీరో మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివకు సమన్లు జారి చేశారు. అయితే ప్రస్తుతం ఆ సమన్ల పై స్టే విదిస్తూ ఫస్ట్ అడిషనల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
అయితే ఇరువర్గాలకు ఈ సమస్యని కోర్టు బయట తేల్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఎటువంటి పరిష్కారం దొరకని పక్షంలో ఇరు వర్గాల వాదనలు విని తామే తీర్పు వెలువరిస్తామని కోర్టు స్పష్టంచేసింది.