'జంబలకిడిపంబ' చాలా ఎట్రాక్టివ్ టైటిల్. ఈ టైటిల్‌ని ఎప్పటికీ మర్చిపోలేము. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పటికీ ఈ సినిమా కామెడీ సినిమాల్లో ఓ క్లాసిక్‌గా చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు నరేష్, ఆమని జంటగా తెరకెక్కిన ఈ సినిమాని ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించారు. చాలా పెద్ద విజయం సాధించింది అప్పట్లో ఈ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ చేద్దామని అప్పట్లో ఇ.వి.వి అనుకున్నారు కానీ కుదరలేదు.
మగాళ్లకు, ఆడ లక్షణాలు, ఆడాళ్లకు మగ లక్షాణాలు వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ని చాలా ఇన్నోవేటివ్‌గా ఆలోచించారు ఇవివి. ఆధ్యంతం గుక్క తిప్పుకోకుండా నవ్వులు పూయించింది ఆ సినిమా. సినిమా నిండా కమెడియన్సే. అలాంటి క్లాసిక్ మూవీ టైటిల్‌ని ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కిస్తున్నారు. జె.బి. మురళీ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'గీతాంజలి' సినిమాతో హీరోగా ప్రమోట్ అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత రెండో సినిమా 'జయమ్ము నిశ్చయమ్మురా' తో హీరోగా మంచి మార్కులేయించుకున్నాడు. తాజాగా 'జంబలకిడిపంబ' సినిమాతో ముచ్చటగా మూడోసారి హీరోగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ రోజు నుండీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సినిమా కాన్సెప్ట్, వివరాలు సంగతి పక్కన పెడితే, టైటిల్‌తోనే సగం విజయం అందుకున్నట్లే శ్రీనివాస్ రెడ్డి. ఆ టైటిల్‌కున్న పవర్ అలాంటిది. ఇదిలా ఉండగా, హీరోగా మంచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ, కమెడియన్‌గానూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమాలో హీరో రవితేజతో దాదాపు ఈక్వెల్ క్యారెక్టర్‌లో నటించి, మెప్పించాడు. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా, కామెడీని మాత్రం వదులుకోనంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి.