కాస్సేపటి క్రితమే 'బాహుబలి 2' ట్రైలర్ విడుదల జరిగింది. ఈ సందర్భంగా 'బాహుబలి' టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కొన్ని కొన్ని సమాధానాలు చెప్పారు చిత్ర యూనిట్. అంటే పొడి పొడిగా అన్న మాట. 'బాహుబలి' తొలి పార్ట్ సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసినవే. ఈ సంచలనాలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ రాజమౌళి రెండో పార్ట్‌లో చాలా మార్పులు చేశామని చెబుతున్నారు. అయితే ఆ మార్పులు ఏంటంటే మాత్రం సినిమా చూడాలంటున్నారు. అయితే మహిష్మతి సామ్రాజ్యం సెట్ తొలి పార్ట్‌లోనే చాలా బాగా చూపించారు. సెకండ్ పార్ట్‌లో అంతకు మించి అద్భుతంగా చూపించారట. తొలి పార్ట్‌లో యుద్ధ సన్నివేశాలతో పోలిస్తే రెండో పార్ట్‌లో చాలా ఎక్కువట. వాటిని విజువల్‌గా నభూతో న భవిష్యతి అన్నట్లు రాజమౌళి చిత్రీకరించామని తెలిపారు. అలాగే అనుష్క పాత్రకు రెండో పార్ట్‌లో చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనుష్క, తమన్నా ఇద్దరూ పోరాట సన్నివేశాల్లో కీలకంగా ఉంటారనీ ఆయన తెలిపారు. ట్రైలర్‌లో కూడా తమన్నా, అనుష్క యుద్ధ సన్నివేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమాలో మార్పులు చేశామని రాజమౌళి తెలిపారు. కొత్త పాత్రల చేరిక, పాత పాత్రల నిడివి తగ్గించడం లాంటివి కూడా ఉన్నాయని అన్నారు రాజమౌళి.