ఎన్నో గొడవలు, కొట్లాటలతో గత కొంతకాలంగా అనూహ్యమైన మలుపులు తిరిగిన తమిళ చలనచిత్ర పరిశ్రమకి చెందిన నడిగర్ సంఘం రాజకీయాలు పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికలతో ఒక కొలిక్కి వచ్చాయి.
ఇక విషయానికి వస్తే, తమిళ నటులు తమ చిరకాల కోరిక అయిన నడిగర్ సంఘం స్వంత భవనం. ఈ కోరికనే ఎజెండాగా పెట్టుకొని తమిళ సంఘం ఎలక్షన్లలో గెలిచిన విశాల్ ప్యానెల్ తమ మాట నిలబెట్టుకుంది. ఈ రోజు ఉదయం నడిగర్ సంఘం సభ్యుల సమక్షంలో నడిగర్ సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రజినీకాంత్, కమల్ హసన్, సూర్య, విక్రంతో పాటుగా పలువురు నటినటులు విచ్చేశారు.