కెవ్వుకేక పుట్టిస్తోన్న సమంత

మరిన్ని వార్తలు

వచ్చే నెల్లో ముద్దుగుమ్మ సమంత పెళ్లి కూతురు కాబోతోంది. నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకోనుంది సమంత. గోవాలో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల్లో సమంత, చైతూ వివాహం జరగనుంది. కాగా సమంత తన పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న దుస్తులను చూసి అభిమానులు ఆశ్చర్యపోవడమే వారి వంతు అవుతోంది. పెళ్లికూతురు అయినా కానీ హాట్‌ అప్పీల్‌లో మాత్రం అస్సలు కాంప్రమైజ్‌ కావడం లేదు సమంత. కొత్త దుస్తుల్లో అందంగా మెరిసిపోవడంతో పాటు హాట్‌ హాట్‌గానూ మురిపించేస్తోంది. సోషల్‌ మీడియాలో ఒకదాని తర్వాత ఒక్కటిగా పెడుతున్న తన వెడ్డింగ్‌ వేర్‌ శ్యాంపిల్స్‌కి సమంత ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. తనకు అత్యంత సన్నిహితురాలు, స్నేహితురాలు అయిన ఫ్యాషన్‌ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ డిజైన్‌ చేసిన వెడ్డింగ్‌ దుస్తుల్లో సమంత మెరిసిపోతోంది. నిశ్చితార్ధంలో సమంత స్పెషల్‌ కాస్ట్యూమ్‌ గురించి అందరూ చర్చించుకున్నారు. ఎందుకంటే నిశ్చితార్ధం శారీని సమంత తన స్వీట్‌ మెమరీస్‌తో స్టిచ్‌ చేయించి, డిజైన్‌ చేయించింది. అంతకుమించిన స్పెషాలిటీస్‌తో తన వెడ్డింగ్‌ వేర్‌ ఉండాలనుకుంటోంది సమంత. అందుకే ఎక్కడా రాజీపడడం లేదు. మరో పక్క సమంత నటించిన 'రాజుగారి గది - 2' సినిమా విడుదలకు సిద్ధమైంది. రామ్‌చరణ్‌తో ప్రయోగాత్మక చిత్రం 'రంగస్థలమ్‌ 1985'లో సమంత నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS