ఆసక్తి రేపుతున్న సుదీప్ ఫాంటమ్ పోస్టర్

మరిన్ని వార్తలు

కరోనా క్రైసిస్ కారణంగా ఈ మధ్య దాదాపుగా అన్ని సినిమాలు షూటింగ్ వాయిదా పడ్డాయి. ప్రభుత్వం షూటింగులు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ మెజారిటీ హీరోలు షూటింగ్ లకు దూరంగానే ఉన్నారు. అయితే కొందరు మాత్రం షూటింగులు మొదలు పెట్టారు. అలాంటి అతి తక్కువ మంది హీరోలు సుదీప్ ఒకరు.

సుదీప్ గత కొన్ని రోజులుగా తన నూతన చిత్రం 'ఫాంటమ్' షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జోరుగా సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలలో నిర్మాతలు ఉన్నారట. యూనివర్సల్ అప్పీల్ ఉండే సబ్జెక్ట్ అని, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సుదీప్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విక్రాంత్ రోనా అనే పాత్రలో సుదీప్ నటిస్తున్నారని సమాచారం. ఈ పోస్టర్లో సింహాసనం తరహా కుర్చీలో సుదీప్ కూర్చుని ఉన్నారు. పోస్టర్ కూడా కళాత్మకంగా ఉంది. ఈ సినిమాలో సుదీప్ కు జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS