టీజర్‌తో దోచేసిన సుధీర్‌బాబు

By iQlikMovies - July 14, 2018 - 12:44 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు సుధీర్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'నన్ను దోచుకుందువటే'. స్టీలర్‌ పేరుతో టీజర్‌ని రిలీజ్‌ చేశారు. టైటిల్‌కి తగ్గట్లుగానే టీజర్‌తో దోచేశాడు సుధీర్‌బాబు. సరికొత్తగా ఉందీ టీజర్. 

ఓ స్ట్రిట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి యజమాని 'కార్తీక్‌' పాత్రలో సుధీర్‌బాబు నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌ చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. గుడ్‌ మార్నింగ్‌ చెప్పినా రెస్పాండ్‌ కానంత స్ట్రిట్‌ ఆఫీసర్‌ అన్నమాట. ఇటు అమ్మాయిలకూ అందుబాటులో ఉండడు. అటు అబ్బాయిలకూ అందుబాటులో ఉండడు. కానీ 'సిరి' అనే ఓ అమ్మాయి కార్తీక్‌ పేరు చెప్పి పండగ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ సిరి ఎవరో వాస్తవానికి కార్తీక్‌కి తెలీదు. 

ఇలా ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఈ స్టీలర్‌ని కట్‌ చేశారు. సుధీర్‌బాబుకు జోడీగా నభా నటేష్‌ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోందీ ముద్దుగుమ్మ. ఎక్స్‌ప్రెసివ్‌ ఫీచర్స్‌తో, నేచురల్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌ చూపిస్తోంది. ఈ సినిమాతో సుధీర్‌బాబు నిర్మాతగా మారుతున్నాడు. 

మొన్నీ మధ్యనే 'సమ్మోహనం' సినిమాతో అందర్నీ నిజంగానే హిప్నటైజ్‌ చేసిన సుధీర్‌బాబు ఈ సారి 'నన్ను దోచుకుందువటే' అంటూ వస్తూ, మరోసారి మనసు దోచుకునేలానే కనిపిస్తున్నాడు. ఆర్‌ ఎస్‌ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చూడాలి మరి సుధీర్‌ మనుసును నభా నటేష్‌ మాత్రమే దోచుకుంటుందా? లేక ఈ ఇద్దరూ కలిసి ఆడియన్స్‌ అందరి మనసుల్నీ దోచేస్తారో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS