సుహాసిని-మణిరత్నంల కొడుకు నందన్ దోపిడీకి గురైన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, స్వంత పనిమీద ఇటలీకి వెళ్ళిన నందన్ వస్తువులని ఎవరో దొంగిలించారు. దీనితో ఆయన వద్ద సెల్ ఫోన్ తప్ప మరేమీ లేకపోవడంతో ఇండియాలోని తన తల్లికి సమాచారం అందించాడు.
వెంటనే స్పందించిన సుహాసిని తన ట్విట్టర్ ద్వారా, వెనిస్ విమానాశ్రయం దగ్గరలో ఎవరైనా ఉంటే అక్కడే ఉన్న తన కుమారుడికి కావాల్సిన సహాయం అందించాల్సిందిగా అభ్యర్దించారు.
దీనికి స్పందించిన కొందరు నందన్ ని కలిసి అతన్ని వెనిస్ లోని హోటలులో ఉంచడం జరిగింది. ఇదే విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియపరిచి, తన కోడుకి సహాయం అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.