సుకుమార్ క్రియేటీవ్ జీనియస్. తన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. తను మంచి రచయిత కూడా. తన మాటలు, సీన్ డిజైనింగ్, క్యారెక్టరైజేషన్ గమ్మత్తుగా అనిపిస్తాయి. స్క్రిప్టు అంతా తానొక్కడే కూర్చుని రాసుకోవడం తనకు అలవాటు. ఈ విషయంలో మరొకర్ని వేలు పెట్టనివ్వడు.
కాకపోతే... పుష్ప 2 కోసం తొలిసారి తన పంథా మార్చాడని తెలుస్తోంది. ఈసారి.. స్టోరీ డిస్కర్షన్స్ లో కొంతమంది యువ రైటర్లకు చోటు ఇచ్చినట్టు సమాచారం. స్క్రిప్టు రాసే విషయంలో కూడా ఇంకొంతమంది సహాయం తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.
పుష్ప సూపర్ హిట్టయిపోవడంతో, పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకోవాలంటే ఇలాంటి కసరత్తులు చేయాల్సిందే. పుష్ప 2 ఎలా ఉండబోతోంది? అందులో ఏం చెప్పబోతున్నాం? అనే విషయాల్లో.. సుకుమార్ ఎప్పుడో ఓ క్లారిటీకి వచ్చేశాడు. కాకపోతే.. అంచనాలు పెరిగిపోయిన నేపథ్యంలో తనని తాను క్రాస్ చెక్ చేసుకోదలిచాడు. అందుకే... మిగిలిన రైటర్ల సహాయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ హోటెల్లో.. పుష్ప డిస్కర్షన్లు వాడీ వేడీగా సాగుతున్నాయని, ఈ సెషన్ అవ్వగానే, సుకుమార్ స్ర్కిప్టు రాయడం మొదలెడతాడని సమాచారం. అంటే.. పుష్ప 2 కథ లాక్ చేయడానికి ఇంకా టైమ్ ఉందన్నమాట.