నేను క్షేమం: సునీల్‌.

By Gowthami - February 03, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య సునీల్ ఆరోగ్యం బాగాలేద‌ని కొన్ని వ‌దంతులు వ్యాపించాయి. ఆయ‌న ఆసుప‌త్రిలో చేర‌డం, ఆ ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల‌... ఈ పుకార్లు బ‌ల‌ప‌డ్డాయి. అయితే ఆసుప‌త్రి నుంచి సునీల్ డిశ్చార్జ్ అయినా.. ఇంకా ఈ పుకార్లు ఆగ‌లేదు. సునీల్ తీవ్ర అస్వ‌స్థ‌త‌లో ఉన్నాడ‌ని, ఆయ‌న ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నార‌ని వార్త‌ల సారాంశం. అయితే వీటిపై సునీల్ మ‌ళ్లీ స్పందించాల్సివ‌చ్చింది. నేను క్షేమంగానే ఉన్నా, నాపై వ‌స్తున్న వ‌దంతుల్ని న‌మ్మొద్దు.. ఓ షూటింగ్ నిమిత్తం విజ‌య‌వాడ వ‌చ్చా... అంటున్నారు సునీల్‌.

 

ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన డిస్కోరాజా, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు విడుద‌ల‌య్యాయి. డిస్కోరాజా ఫ్లాప్ అయినా, అల వైకుంఠ‌పుర‌ములో హిట్టైంది. ఆ మైలేజీతో ఇంకొన్ని సినిమాలు సునీల్ ఖాతాలో ప‌డే ఛాన్సుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS