జంతువులపై జరుగుతున్న హింసకి వ్యతిరేకంగా పోరాడే సంస్థ 'పెటా'. చాలా మంది సెలబ్రిటీస్ ఈ సంస్థకు మద్దతిస్తుంటారు. మద్దతు సంగతి పక్కన పెడితే, సెలబ్రిటీలు ఈ సంస్థ ప్రచారంలో భాగంగా అర్ధ నగ్నంగా ఫోటోలకి పోజులిస్తూ సందేశాలు పంపుతుంటారు. గతంలో ముద్దుగుమ్మ త్రిష ఈ సంస్థకు మద్దతులో భాగంగానే జల్లికట్టు విషయంలో మాట్లాడింది. ఆ విషయమై అప్పుడు అది పెద్ద దుమారానికే తెర లేచింది. దాంతో అప్పుడు 'పెటా' నుండి త్రిష తప్పుకున్న పరిస్థితి.
తాజాగా ఈ కోవలోకి పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా చేరింది. సన్నీలియోన్ ఏకంగా తన భర్తతో కలిసి పూర్తి నగ్నంగా పోజిస్తూ, ప్రచారం చేసింది. అంతేకాదు జంతువుల నుండి చర్మాన్ని తీస్తున్న ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. అత్యంత జుగుప్సాకరంగా ఉంది ఆ వీడియో. బతికుండగానే మొసళ్లు, గొర్రెల వంటి జంతువుల నుండి చర్మాన్ని తీస్తున్నట్లుగా ఉంది ఆ వీడియో. జంతువుల్ని అంత బాధపెట్టి తీసిన వాటి చర్మం నుండి తయారు చేసిన లెదర్ జాకెట్స్, షూస్ వంటి వాటిని వాడకండి అంటూ సన్నీలియోన్ దంపతులు 'పెటా' తరపున ప్రచారానికి దిగారు.
'పెటా' ప్రచారం సంగతి పక్కన పెడితే, మరీ నగ్నంగా ప్రచారం చేయాలామ్మా అంటూ నెటిజన్లు ఆమెపై గుర్రుమంటున్నారు. మామూలుగానే సన్నీలియోన్ అంటే సెక్సప్పీలే గుర్తుకొస్తుంది. అయితే ఓ మంచి కార్యక్రమం కోసం చేసిన ప్రచారానికి కూడా మరీ ఇంతలా సక్సెప్పీల్ చూపించడమేంటని వాదిస్తున్నారు. బాలీవుడ్ హాటెస్ట్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న సన్నీలియోన్ ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంటే కదా. ఆ ఖాతాలోనే ఈ 'పెటా' ప్రచారం కూడా. అయితే ఈ సారి కొంచెం కొత్తగా భర్తతో కలిసి న్యూడ్ పోజుకి దిగింది. అంతే తేడా!