'నన్ను పోర్న్ స్టార్ అనొద్దు' అని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు గనుక, 'సరే, నేను పోర్న్ స్టార్‌నే' అని ఒప్పేసుకోక తప్పడంలేదు ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కి.
ఇప్పుడామె పోర్న్ ఇండస్ట్రీలో లేదు, బాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటుతోంది. అయితేనేం ఒకప్పటి పోర్న్ స్టార్ కాబట్టి, ఆ పోర్న్ స్టార్ ఇమేజ్‌తోనే బాలీవుడ్‌లో ఇంకా ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి, ఆ ఇమేజ్‌ని ఆమె ఎంజాయ్ చేయడాన్ని తప్పు పట్టలేం. సినిమాలొక్కటే కాదు, సన్నీలియోన్ సంపాదనా మార్గాల్లో ముఖ్యమైనది 'బ్రాండింగ్'. తన పేరే సూపర్బ్ బ్రాండ్ అనుకున్న సన్నీలియోన్, ఆ పేరు మీద చాలా ప్రోడక్ట్స్‌ని తీసుకొస్తోంది. లిప్ స్టిక్ నుంచి, డిజైనర్ వేర్ వరకూ పలు రకాలైన ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌లో అమ్మేస్తోన్న ఈ బ్యూటీ, ఇందుకోసం హాట్ హాట్‌గా పోజులిచ్చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుండడం గమనించాల్సిన విషయమే.
'ఔను, సన్నీలియోన్ అనే పేరే ఓ బ్రాండ్. ఇంకెవరికో బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసేకన్నా, నేనే ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని రూపొందించుకుని, దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం లాభదాయకం కదా' అని అంటోంది సన్నీలియోన్. 'స్టార్ స్ట్రక్' పేరుతోనూ, ఇతరత్రా అనేక పేర్లతోనూ సన్నీలియోన్ తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకుంటోంది. సన్నీలియోన్ బ్రాండ్ ఉత్పత్తులకు సేల్స్ బిపరీతంగా వుంటున్నాయట. బాలీవుడ్‌కి కేవలం సినిమాల కోసమే రాలేదనీ, తన ఆలోచనలు చాలా భిన్నంగా వుంటాయనీ మొదట్లో ఈ పోర్న్ స్టార్ చెప్పిన మాటల్ని ఎవరైనా లైట్ తీసుకుంటే, ఇప్పుడు చింతించాల్సిందే.