సన్నీలియోన్‌ చెల్లెలు కూడా ఎంట్రీ ఇస్తోంది..!

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా సత్తా చాటుతూ, ఈ మధ్యనే సౌత్‌ ఇండస్ట్రీలో కూడా సక్సెస్‌ఫుల్‌గా అడుగు పెట్టిన శృంగార తార సన్నీలియోన్‌ బాటలో మరో తార కూడా సౌత్‌ సినిమాపై కన్నేసింది. ఈమె పేరు మియా రాయ్‌ లియోని. హా మీ గెస్‌ కరెక్టే. ఈమె సన్నీలియోన్‌కి వరుసకు సోదరి అవుతుందట. బాట కూడా అదే, ఐరోపాలో పాపులర్‌ అడల్ట్‌ స్టార్‌గా వెలుగొందిందట ఈ మియా లియోని. ఇప్పుడు ఓ తమిళ చిత్రంతో సౌత్‌లోకి ఆరంగేట్రం చేస్తోంది.

'ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు' అనే తమిళ చిత్రం ద్వారా ఈ హాట్‌ బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. డిశంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో పూర్ణ పోలీసాఫీసర్‌గా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. విమల్‌, ఆశ్నాజవేరి జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈ పోర్న్‌ స్టార్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించనుందట. శృంగార తార కదా. బీభత్సమైన స్కిన్‌ షో చేసేస్తోందనుకునేరేమో. కాదట ఎంట్రీ మూవీలో ఓ మోస్తరు గ్లామర్‌తో కనిపించనుందట. మొదట్లో సన్నీలియోన్‌ కూడా చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది.

తర్వాత హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్పెషల్‌ సాంగ్స్‌లో స్పెషల్‌గా మెరిసిపోయింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడే సౌత్‌లో కూడా ఓ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్‌గా సౌత్‌లో 'వీరమహాదేవి' సినిమాలో నటిస్తోంది. దాదాపు సౌత్‌ భాషలన్నింట్లోనూ ఈ సినిమా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS