కరోనా అలర్ట్‌: సన్నీలియోన్‌ జాగ్రత్తలివే!

By Inkmantra - January 30, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ని ఈ మధ్య ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బాలీవుడ్‌లో కాస్త హవా తగ్గిన ఈ భామ సౌత్‌ సినిమాలపై దృష్టి పెట్టింది కానీ, ఇక్కడ కూడా అంతగా కలిసి రావడం లేదు. అప్పుడెప్పుడో 'వీరమహాదేవి' అనే సినిమాని స్టార్ట్‌ చేసింది. కానీ, ఆ సినిమా ఏమైందో ఏమో ఎవ్వరికీ తెలీదు. ఇకపోతే, తనను అంతా మర్చిపోయారనుకుందో ఏమో, ఇదిగో ఇలా వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచాన్ని 'కరోనా' వైరస్‌ గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిట్యువేషన్‌ని యూజ్‌ చేసుకోవాలనుకుందో ఏమో పతీ సమేతంగా దర్శనమిచ్చింది.

ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో నల్ల రంగు మాస్క్‌లు ధరించి కరోనా నుండి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. ఎయిర్‌పోర్ట్స్‌ నుండే ఈ వైరస్‌ ఎక్కువగా సోకే ప్రమాదమున్న కారణంగా, ఎయిర్‌పోర్ట్‌ వద్ద ప్రయాణికులు ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరించాలని సన్నీలియోన్‌ సూచించింది. ఈ సెక్సీ భామ సూచనల్ని ఫ్యాన్స్‌ పాటించకుండా ఉంటారా.? చెప్పండి. ఇదిలా ఉంటే, సన్నీలియోన్‌ బిగ్‌ స్క్రీన్‌ సంగతెలా ఉన్నా, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై బిజీగానే గడుపుతోంది. అన్నట్లు సన్నీ నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవదీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS